Wednesday, March 11, 2026
Homeహైదరాబాద్‌Padma Rao Goud | అన్ని దానాలలో రక్త దానం మిన్న

Padma Rao Goud | అన్ని దానాలలో రక్త దానం మిన్న

అన్ని దానాలలో రక్త దానం గొప్పదని,అత్యవసర సందర్బాలలో రోగులను ఆదుకొనేందుకు రక్తదానం ఉపకరిస్తుందని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.చిలకలగూడ మున్సిపల్ మైదానంలో పుల్వామా అమరుల సంస్మరణార్ధం శనివారం మెగా రక్త దాన శిబిరాన్ని ఎం.కే.ఎం. ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ రక్త దానాన్ని ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు.యువ నేత రామేశ్వర్ గౌడ్,నిర్వాహకులు మురళి కృష్ణ,సాయి యాదవ్, నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News