- మంచినీటి, శానిటేషన్, డంపింగ్ యార్డ్ చెత్త తదితరాలు వెంటనే తీర్చండి..
- మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్
మేడ్చల్ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా, శానిటేషన్, డంపింగ్ యార్డ్ చెత్త సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ శనివారం సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చీర్ల రమేష్ మేడ్చల్ ప్రజలు గత కొంత కాలంగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని (HMWSSB) ఎండి అశోక్ రెడ్డి కి వివరించారు.
దీనికి వెంటనే స్పందించిన వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ సమస్యకు వారం రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని చీర్ల రమేష్ తెలిపారు. అనంతరం సైబర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ శ్రీజనా ను కలిసి శానిటేషన్, అధ్వెళ్లి డంపింగ్ యార్డు సమస్యలను వివరించారు.
అధ్వెళ్లి డంపింగ్ యార్డులో చెత్త తగలబెట్టడం వల్ల వస్తున్న పొగ దుర్వాసన కారణంగా ప్రజలు అనారోగ్యాల బరిన పడుతున్నారని కమిషనర్ కు దృష్టికి తీసుకెళ్లామని రమేష్ తెలిపారు. మేడ్చల్ సమస్యల పై అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.
