Friday, March 20, 2026
HomeరాజకీయంMedchal | మేడ్చల్ ప్రజల త్రాగునీటి సమస్య తీర్చాలని అధికారులను

Medchal | మేడ్చల్ ప్రజల త్రాగునీటి సమస్య తీర్చాలని అధికారులను

  • కోరిన బిజెపి నాయకులు

మేడ్చల్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని మేడ్చల్ బిజెపి నాయకులు అన్నారు.శుక్రవారంమేడ్చల్ పట్టణంలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై బీజేపీ నాయకులు జె. శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించగా, జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి (DRO)కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా శైలజ హరినాథ్ తో పాటు రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రతిరోజూ పుష్కలంగా వచ్చే నీరు రెండు మూడు రోజులుగా మారి ప్రస్తుతం వారానికి ఒకసారి కూడా రాని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మేడ్చల్ సమీపంలోని ఘనపూర్ రిజర్వాయర్ నుండి ఇతర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుండగా మేడ్చల్ పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

- Advertisement -

పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించి ప్రతిరోజూ లేదా నియమిత వ్యవధిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా ఏర్పాటు చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అధ్యక్షురాలు జె. శైలజ హరినాథ్, రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ అర్జున్ బాబు నాయకులు ప్రేమ్ దాస్ ,శ్రీనివాస్ గౌడ్, హేమలత, అనిత, బాబు రాజు, నరేందర్, సాయికుమార్, శివకుమార్. పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News