- బ్రాహ్మణులకు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి
- డిమాండ్ చేసిన బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్
ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) ఆధ్వర్యం లో శుక్రవారం రోజు జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన తో కలిసి రాఘవేంద్ర శర్మ, గోపాల కృష్ణమాచార్యులు మాట్లాడుతూ…
దేవాలయాలలో పూజా విధానం నుండి పూజారులుగా బ్రాహ్మణులను తీసివేయాలని, బ్రాహ్మణులు పూజారులుగా పేటెంట్ కలిగి వున్నారా అని మంద కృష్ణ మాదిగ అన్నారు. యుగయుగాలుగా దేవాలయాలలో పూజారుగా, వేదాలు చదువుతున్నది, నేర్పుతున్నది బ్రాహ్మణులేనని. ఈనాటికి దేశంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లడానికి కారణం బ్రాహ్మణులేనని గుర్తుచేశారు. పూజారులుగా, అర్చకులుగా బ్రాహ్మణులకు పేటెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

సమాజంలో అసమానతలు పోయి సమానత్వం రావాలంటే ఏళ్ల తరబడి వున్న రిజర్వేషన్లు కొనసాగింపును ప్రభుత్వం పునః పరిశీలించాలని, బ్రాహ్మణులకు అట్రాసిటీ చట్టం తేవాలని, అర్చకత్వం బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమసమాజం లో బ్రాహ్మణుల గౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని బాస్ టీమ్ తెలిపారు.
మతం మార్చుకొని రిజర్వేషన్లు అనుభవిస్తూ రెండు మతాలకు దెబ్బకొడుతున్న దళిత క్రైస్తవుల వైనాన్ని హిందూ కులస్తులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాస్ టీమ్ సభ్యులు ఎం.వి.శాస్రీ, సుబ్బారావు, లక్ష్మీనారాయణ, రాఘవరావు, ప్రమోద్, జ్యోతి, గంగేశ్వర్, కైలాష్, శ్రీనివాసరావు, సుధాకర్ శర్మ, బాలసాయి తదితరులు పాల్గొన్నారు.
