Tuesday, March 10, 2026
Homeరంగారెడ్డిDispute | పాత బాకీ వసూలులో నిండు ప్రాణం బలి..!

Dispute | పాత బాకీ వసూలులో నిండు ప్రాణం బలి..!

సతీష్ అను వ్యక్తి కి మరియు యెడ్ల యాదయ్య అను వ్యక్తి కి మధ్య లావాదేవీలు ఉండడంతో అట్టి విషయంలో సతీశ్ తన హోటల్ లో పని చేయు ఇద్దరు వ్యక్తుల తో కలిసి తేదీ 07.03.2026 నాడు సుమారు 07:30 గంటలకు చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి యెడ్ల యాదయ్య ను డబ్బుల గురించి అడుగుతుండగా వారి మద్య గొడవ జరిగి యాదయ్య ను సతీశ్ కొట్టగా వెంటనే అతను స్పృహ తప్పి పడిపోగ వెంటనే వాళ్ళు అతడిని ఆటొ లో GBR హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఉన్న డ్యూటి డాక్టర్ అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్దారించినాడు. ఇట్టి విషయం తెలుసుకున్న యాదయ్య తండ్రి యెడ్ల కోటేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ చైతన్యపురి పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News