- అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గీర్మా పూర్ గ్రామంలో ప్రతిఏటా గుట్టల మల్లన్న స్వామి జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధలతో 11వ తేదీన నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు, ఈ సందర్భంగా వారు బుధవారం మేడ్చల్ ఏ సి పి శంకర్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ లను వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మల్లన్న స్వామి కల్యాణం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు,అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆలయం ఎంతో విశిష్ట మైనదని స్వామిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముక్కెర ఆనంద్, పద్మా రెడ్డి, రాజీ రెడ్డి, భాస్కర్ యాదవ్, వేణు ,సత్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -
