జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills By-Election)లో మాగంటి సునీత(Maganti Suneetha)కు మద్దతుగా మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలు (Malkajgiri Brs Leaders) ప్రచారం (campaign) చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Mla Marri Rajashekar Reddy) ఆదేశాల మేరకు సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతకు సపోర్ట్‌గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ బూత్ నంబర్ 304లో మల్కాజిగిరి బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్, తుపాకుల కోటేశ్వర్, కె.శ్రీధర్ గౌడ్, ఎం. నవీన్, రాజు గౌడ్, ఇబ్రహీం, చంద్రశేఖర్, ఏసు, రాములు తదితరులు పాల్గొన్నారు.
- Advertisment -
