Thursday, March 5, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐSaree | చీరలోని గొప్పతనాన్ని చాటిన ఎన్ఆర్ఐ

Saree | చీరలోని గొప్పతనాన్ని చాటిన ఎన్ఆర్ఐ

కెనడా(Canada)లో ఉండే ఒక ఎన్ఆర్ఐ మహిళ(NRI Lady).. చీరలోని గొప్పతనాన్ని ఘనంగా చాటారు. ఆ దేశ సిటిజన్‌షిప్(Citizenship) స్వీకరించే కార్యక్రమానికి శారీలో వచ్చి ఔరా అనిపించారు. ఆమె పేరు దివ్యా లాట్లికర్(Divya Latlikar). మహారాష్ట్ర(Maharastra)కు చెందిన ఈమె తమ రాష్ట్రం నుంచి సంప్రదాయ చీరను కెనడాకు తెప్పించుకున్నారు. ఆ శారీని కట్టుకొని నుదిటిపై బిందీ పెట్టుకొని కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తన జీవితంలోని మర్చిపోలేని సంఘటన అని, ఈ చీర ధరించటం మానసిక స్థైర్యానికి, గౌరవానికి, సహనానికి ప్రతీక అని చెప్పారు. సంబంధిత వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియా పట్ల తన ప్రేమను ఈ వీడియోతోపాటు తెలిపారు. కెనడా ఉండటం గర్వంగా భావిస్తున్నప్పటికీ స్వదేశాన్ని మర్చిపోకూడదని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News