Thursday, January 22, 2026
EPAPER
Homeమహబూబ్‌నగర్‌Mahabubnagar Mla | ఎమ్మెల్యే యెన్నం జన్మదిన వేడుకలు

Mahabubnagar Mla | ఎమ్మెల్యే యెన్నం జన్మదిన వేడుకలు

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) జన్మదిన వేడుకలు(Birthday Celebrations) ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని రాములవారి సన్నిధిలో, మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థ ప్రాంగణంలోని మెప్మా కార్యాలయం(Mepma Office)లో ఈ ఉత్సవాలను నిర్వహించారు. లంగర్ హౌజ్‌లోని శ్రీరామాలయంలో ఎమ్మెల్యే యెన్నం.. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం, సమృద్ధి కోసం ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు యాసకుమార్ తదితరులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.

పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రాహుల్ దాస్ బాబా ఆశీర్వాదాలు మరింత సేవాభావంతో ప్రజలకు పనిచేసే శక్తినిస్తాయని విశ్వసిస్తున్నట్లు శాసన సభ్యులు చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహబూబ్‌నగర్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థ ప్రాంగణంలోని మెప్మా కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో యెన్నం జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్(Cake Cutting) చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మహిళా సాధికారత సాధికారిణులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News