Monday, February 16, 2026
Homeహైదరాబాద్‌Release | లిటిల్ చాంప్స్ గ్రూప్ నుండి 'శివ లింగాష్టకం' విడుదల..

Release | లిటిల్ చాంప్స్ గ్రూప్ నుండి ‘శివ లింగాష్టకం’ విడుదల..

  • ఇది 2026 సంవత్సరపు మొట్టమొదటి ప్రాజెక్టు..
  • ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ నివాసంలో కార్యక్రమం..
  • వివరాలు తెలియజేసిన డాక్టర్ బందనపూడి ఆదిత్య కిరణ్..

స్వరమహతి సంగీతాలయం, విద్యార్థులు 2026 లో తమ తొలి ప్రయత్నంగా ‘ శివ లింగాష్టకం ‘ ని విడుదల చేశారు.. ఈ కార్యక్రమం స్వరమహతి ప్రిన్సిపాల్, డాక్టర్ బందంపూడి ఆదిత్య కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ నివాసంలో ఆయన సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.. ఆదివారం శివరాత్రి పర్వదినాన ఇలాంటి మహత్తర కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరమని ఆదిత్య కిరణ్ ఆనందం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిల్లలను ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులను, ప్రిన్సిపాల్ ని అభినందిస్తూ మాట్లాడారు.. లిటిల్ చాంప్స్ గ్రూప్ మరింత గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని ఆశించారు.. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆదిత్య కిరణ్ అన్నారు.. శివ లింగాష్టకాన్ని లిటిల్ చాంప్స్ ఎంతో అద్భుతంగా ఆలపించారు.. ఈ ఆలాపన కార్యక్రమంలో వివిక్త, మైరా, రియాన్ష్, లూషా, కాత్యాయని, దివిషా, పునర్వి భాగస్వాములైయ్యారు..

- Advertisement -

డాక్టర్ బందంపూడి ఆదిత్య కిరణ్ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే చిన్నారులకు అభినందనలు తెలియజేశారు.. ఈ గీతం ప్రస్తుతం స్పూటిఫై, జిఓ సావన్, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, లో అందుబాటులో ఉందని, ఈ గీతాన్ని ఆస్వాదించి పిల్లలను ఆశీర్వదించి వారిని ప్రోత్సహించాలని కోరారు.. స్వరమహతి సంగీతాలయానికి వెన్నుముకగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News