Friday, October 3, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్LICలో 250 మందికి అప్రెంటిస్

LICలో 250 మందికి అప్రెంటిస్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC).. హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL)లో 250 మందికి ఏడాది అప్రెంటిస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 24 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసినవాళ్లు అర్హులు. పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.12 వేలు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటీస్ 2025 జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 13 నుంచి 28 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అంతకన్నా ముందు నాట్స్ పోర్టల్(NATS portal)లో రిజిస్టర్ అవ్వాలి. ప్రవేశ పరీక్షను జులై 3న నిర్వహిస్తారు. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. పూర్తి వివరాలకు www.lichousing.comను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News