Tuesday, February 10, 2026
Homeనల్లగొండDrugs | డ్రగ్స్ నిర్మూలిద్దాం

Drugs | డ్రగ్స్ నిర్మూలిద్దాం

అన్ని శాఖలు కృషి చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచన
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం

సూర్యాపేట, నవంబర్ 13 (ఆదాబ్ హైదారాబాద్): సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లా(Drugs Free District)గా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. దీనిపై గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నార్కోటిక్స్(Narcotics)పై ఎస్పీ కె.నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల జీవితాలు (Students Life) ఎలా పాడవుతున్నాయో (Spoil) తెలియజేసేలా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను (Awareness programs) నిర్వహించాలని సూచించారు.

- Advertisement -

మెడికల్ షాపుల్లో (Medical Shops) డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు (Drug Inspectors) తనిఖీలు చేపట్టాలని, ఎక్సైజ్ అధికారులు గుడుంబా, సారా, కల్తీ మద్యాన్ని నిర్మూలించాలని ఆదేశించారు. జిల్లా విద్యా శాఖ అధికారి, ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి, పోలీస్, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు. విద్యా సంస్థలు, హాస్టల్స్‌లో తనిఖీలు (Checkings) చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. యాంటీ డ్రగ్స్‌పై పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా మత్తు పదార్థాలు, డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, గంజాయి, మత్తు పదార్థాలు లాంటి వ్యసనాలకి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. విద్యా సంస్థల్లో నిఘా పెట్టాలని, విద్యార్థులు, టీచర్లతో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటుచేయించాలని సూచించారు.

ఇటీవలి కాలంలో మత్తు పదార్థాలు, ఇ-సిగరెట్స్, చాక్లెట్స్, లిక్విడ్ రూపంలో, అల్ఫ్రాజులుం టాబ్లెట్స్ రూపంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీస్ శాఖకు చెప్పేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నకిలీ లిక్కర్, నల్ల బెల్లం, పట్టిక, అల్ఫ్రాజులం టాబ్లెట్స్ లాంటివి ఉపయోగించటం మనుషుల మరణానికి కారణాలు అవుతున్నాయని చెప్పారు. అలాంటి వాటికి జిల్లాలో ఆస్కారం లేదని, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపటానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, స్త్రీ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, అబ్కారి సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్, డీపీఓ యాదగిరి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, విద్యా శాఖ కోఆర్డినేటర్ రాంబాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News