- అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అమలు చేయాలి
- న్యాయవాది కొంగళ్ల నవీన్ డిమాండ్
కేతిరెడ్డి పల్లిలో న్యాయవాది స్వప్న దారుణ హత్య ఘటనను కొంగళ్ల నవీన్ న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఆమె తన కాలేజీ జూనియర్ అని, మొయినాబాద్ భాస్కర్ లా కాలేజీలో చదివి ప్రస్తుతం చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తోందని తెలిపారు. ఈ ఘటనతో మొత్తం న్యాయవాదుల సమాజం షాక్‌కు గురైందని, న్యాయవాదుల భద్రతపై పెద్ద ముప్పు నెలకొందని అన్నారు. వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని విమర్శించారు.
న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ తీసుకురావాలని, దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మృతురాలు స్వప్న కుటుంబానికి రూ.50 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో మాజీ బార్ కౌన్సిల్ సభ్యుడు హనుమంత రెడ్డి, ప్రియాంక, శివ, ప్రవీణ్, ఖాదర్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
