జవహర్ నగర్‌లోని సర్వే నంబర్ 648లోని ప్రభుత్వ భూమి స్వాహా
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, జనవరి 18(ఆదాబ్ హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి(GHMC)లోని జవహర్ నగర్(Jawahar Nagar) చెన్నాపురం ప్రాంతంలో ప్రభుత్వ భూముల(Government Land) కబ్జాలు ఆందోళనకర స్థాయికి చేరాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 648లో నర్సరీ కోసం కేటాయించిన భూమిని అక్రమార్కులు ఓపెన్‌గా విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ప్లాట్లుగా మార్చి పేపర్‌పై లేఔట్ రూపొందిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడుతున్నారు.
ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులుగా చూపిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు(Illegal Registrations), నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వైనం బయటపడుతోంది. అనుమతులు లేకుండా లేఔట్లుగా ప్రచారం చేయడం, స్థలాలు అమ్మడం జరుగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఖద్దర్(Police) అండదండలు ఉండటంతో అక్రమార్కులు అధికారుల్ని లెక్కచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కబ్జాలపై ఫిర్యాదులు ఉన్నా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్(Medchal Malkajgiri District Collector) ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించి, సర్వే నంబర్ 648లోని భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ లేఔట్లను రద్దు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఇకనైనా వారు స్పందించాలని జవహర్ నగర్ ప్రజలు కోరుతున్నారు.
