ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) ఈ రోజు అసెంబ్లీ(Assembly)లో మాట్లాడారు. తన నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖ అధికారులు(Forest Officers) ప్రజలను రకరకాల ఇబ్బందుల(Trouble)కు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల అటవీ శాఖ మంత్రి(Forest Minister) కొండా సురేఖ(Konda Surekha) త్వరలోనే దీనిపై సమీక్ష సమావేశం(Review Meeting) నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఖానాపూర్ కేంద్రంలో ఏటా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఇంటర్ పూర్తిచేసుకొని బయటకు వెళ్తున్నారని చెప్పారు. ఇంటర్ పూర్తి చేసినవారు జాయిన్ కావటానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ(Degree College) లేదని, ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Khanapur Mla | అసెంబ్లీలో వెడ్మ బొజ్జు పటేల్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

