నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు(Nirmal Dcc Chief), ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel).. డెమ్మేలా రాజులగుట్ట(Demmela Rajula Gutta)లో కుటుంబ సభ్యుల(Family Members)తో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉట్నూర్ మండలం దామనపేట నర్సాపూర్ జేలో 25 ఏళ్ల తర్వాత ఈ పవిత్ర గుట్టలో ఎమ్మెల్యే అడుగుపెట్టడం గమనార్హం. శాసన సభ్యుడు.. స్థానిక ఆదివాసీ నాయకులు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలతో కలిసి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు పవిత్రమైనవని తెలిపారు. అడవుల్లో నివసించే ఆదివాసీ దేవతలకు సామూహిక హక్కుల కింద పట్టాలు ఇవ్వాలని కోరారు.
నేటి యువత మన వారసత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో రూ.5 లక్షలతో సోలార్ లైట్లు అమర్చారు. భవిష్యత్తులో తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చిన్నతనం నుంచి ఈ గుట్టల్లో నడిచి పెరిగిన ఎమ్మెల్యే.. ఇప్పుడు నాయకుడిగా తిరిగొచ్చి గొప్ప సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, కల్లూర్గుడా గ్రామ పటేల్ ఆత్రం సోనేరావు, సర్పంచ్‌లు ఆత్రం తిరుపతి, సోయం భారత్, ఆత్రం జాలింషా, ఉపసర్పంచ్ మాధవి లక్ష్మణ్, మాజీ సర్పంచ్‌లు ఆత్రం మాధవ్, ఆత్రం రాహుల్, కనక, గంగారం తదితరులు పాల్గొన్నారు.

