ప్రజలు (People) ప్రతిపక్షాల (Opposition Parties) తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దని నిర్మల్ జిల్లా (Nirmal District) డీసీసీ అధ్యక్షుడు (Dcc President), ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. అభివృద్ధి కోసం అధికార పార్టీకే ఓటు వేయాలని కోరారు. ముధోల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ముధోల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు షబానా బేగం, ఏజాద్ ఉద్దీన్‌ల బ్లాక్ బోర్డ్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ జడ్పీటీసీ నిర్మల్ పాట్టిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

