Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణగరళకంఠుడి కృప అందరిపై ఉండాలి

గరళకంఠుడి కృప అందరిపై ఉండాలి

రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయని అన్నారు. గరళాన్ని తన కంఠంలో దాసుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమా శంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకుండాలని ఆకాంక్షించారు. సుఖ శాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్‌ ఆ మహాశివున్ని ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News