Monday, March 23, 2026
Homeమహబూబ్‌నగర్‌Deeksha Divas | కెసిఆర్ దీక్ష దివాస్ వల్లే రాష్ట్రం సిద్ధించింది.

Deeksha Divas | కెసిఆర్ దీక్ష దివాస్ వల్లే రాష్ట్రం సిద్ధించింది.

  • పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్..

కెసిఆర్ దీక్ష దివాస్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వనపర్తి పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అన్నారు. గురువారం మాజీమంత్రి నివాసంలో పట్టణ బి ఆర్ ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలుస రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా దీక్ష దివాస్ నిర్వహించి, నాయకులు, కార్యకర్తలు దీక్ష దివాస్, ప్రాముఖ్యతను ప్రజలకు, నేటి యువతరానికి వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దీక్ష దివాస్ కు ప్రతి వార్డు నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.

దీక్షా దివాస్ తో స్థానిక సంస్థలు ఎన్నికలకు సమరభేరి మోగించి స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవాసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 14 ఏళ్ల ఉద్యమం 10 ఏళ్ల కెసిఆర్ సుపరిపాలన నేటి యువతకు అవగాహన కల్పించేందుకు పార్టీ ఘనంగా నిర్వహిస్తున్నందున పట్టణ కార్యవర్గం కీలకపాత్ర పోషించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ కార్యదర్శి గంధం పరంజ్యోతి, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, ఆవుల రమేష్, విజయ్ కుమార్, ఉంగ్లం తిరుమల్, బండారు కృష్ణ, కంచ రవి, స్టార్ రహీం, గులాం ఖాదర్ ఖాన్, రమేష్ నాయక్, షేక్ జహంగీర్, జోహాబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, ఎం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News