Wednesday, March 25, 2026
Homeకరీంనగర్Bind-Over | వివిధ కేసుల్లో 8 మంది బైండ్ ఓవర్

Bind-Over | వివిధ కేసుల్లో 8 మంది బైండ్ ఓవర్

కరీంనగర్ రూరల్ పోలీసులు వివిధ కేసులలో 8 మందిని రూరల్ తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు వివరాల్లోకి వెళితే అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తు పట్టుబడిన గంట మల్లేష్ గంట లక్ష్మణ్ మరియు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న గన్ను రాకేష్ రెడ్డి, ఆస్త పురం విజయ్, నాగపురి అజయ్, నాగపురి రమేష్, పోలు గణేష్, బిజిలి చందు అనే వ్యక్తులను మళ్ళీ ఎలాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడకుండా కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ముందు హాజరు పరిచి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News