కరీంనగర్ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో నూతన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో అధీకృత అధికారి మహేశ్వర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ పమేలా సత్పతి హాజరై అభినందనలు తెలిపారు.
మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల నర్మధకు 21 ఓట్లు లభించాయి. అనంతరం కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
డిప్యూటీ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హీనా అఫ్రీన్‌కు 22 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. మేయర్, డిప్యూటీ మేయర్‌లు నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
