హైదరాబాద్ జిల్లా(Hyderabad District)లో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గం(Khairatabad Constituency)లోని ఎంఎస్ మక్తలో పర్యటించారు. రోడ్లు గుంతలతో అధ్వాన్నంగా ఉండటాన్ని పరిశీలించారు. రాకపోకలు సాగించేందుకు స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. మెహిదీపట్నం (Mehdipatnam) రైతు బజార్(Raithu Bazar)ను సందర్శించి అక్కడి కూరగాయల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్(CM Revanth)పై మండిపడ్డారు. సింగరేణి (Singareni) కార్మికుల చెమట, రక్తంతో సంపాదించిన కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి తన జల్సాల కోసం వాడుకోవడం దారుణమని మండిపడ్డారు.
- Advertisement -
