జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్
తెలంగాణ సమాజాన్ని తన కవితలతో జాగృతం చేసిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మంగళవారం ప్రజాకవి కాళోజీ జయంతినీ పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలన కమిషనర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ యాస, భాష కోసం వారు చేసిన కృషికి గుర్తింపుగా కాళోజీ జయంతినీ తెలంగాణ భాషా దినోత్సవ జరుపుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర అని కొనియాడారు. కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ గీతా రాధిక, సీఈ సహదేవ్ రత్నాకర్, విజిలెన్స్ అదనపు ఎస్పీ సుదర్శన్, డీఎస్పీ నరసింహ రెడ్డి, పిఆర్ఓ మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.




