Monday, February 16, 2026
Homeస్పోర్ట్స్KAKA T20 League | తొలి రోజు నల్గొండ, ఖమ్మం జట్ల విజయం

KAKA T20 League | తొలి రోజు నల్గొండ, ఖమ్మం జట్ల విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా T20 లీగ్(Kaka Venkataswamy Memorial Telangana Inter-District T20 League) పోటీల్లో ఈ రోజు మొదటి మ్యాచ్‌లో వరంగల్(Warangal), నల్గొండ(Nalgonda) జిల్లాలు తలపడ్డాయి. పెద్దపల్లి ఎంపీ(Peddapalli MP) జి.వంశీ(G.Vamshi), మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ టాస్ వేసి మ్యాచ్‌ని ప్రారంభించారు. టాస్ గెలిచిన వరంగల్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ 36, రాహుల్ 33 పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన నల్గొండ జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నల్గొండ జట్టులో జ్ఞానప్రకాశ్ 56 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో.. ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమేష్‌బాబు చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man Of The Match Award) ఇచ్చారు.

రెండో మ్యాచ్‌లో ఖమ్మం, మహబూబ్‌నగర్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఖమ్మం జట్టు బ్యాటింగ్ తీసుకొని 20 ఓవర్లలో 8 వికెటలు కోల్పోయి 152 పరుగులు చేసింది. శివ 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్ జట్టులో హరీష్ 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ టీమ్ 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. లైటింగ్ సరిగా లేని కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లా 10 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఖమ్మం ఆటగాడు నాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమంలో కేడీసీఏ అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శి మురళీధర్‌రావు, ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, కోశాధికారి బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News