Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Foundation Stone | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Foundation Stone | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బీటీ రోడ్డు(BT Road), కుడా(Kuda) వెంచర్ అభివృద్ధి పనులకు (Development Works) వరంగల్ ఎంపీ (Warangal Mp) డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya), స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే (STATIONGHANPUR Mla) కడియం శ్రీహరి (Kadiyam Srihari) శంకుస్థాపన చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామ శివారులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (Kakatiya Urban Development Authority) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న యూనిసిటీ వెంచర్ అభివృద్ధి, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా కడియం కావ్య మాట్లాడుతూ..

- Advertisement -

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వరంగల్ నగరాన్ని అందరి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నగరానికి ఎయిర్‌పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్‌తోపాటు నగర ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు రూ.4 వేల కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డికి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పైకి అభినందనలు తెలిపారు. వెంచర్ దాక నిర్మించే 4 లైన్ల బీటీ రోడ్డును ఉనికిచర్ల గ్రామం వరకు పొడిగించాలని కోరారు.

ఇదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతోందని అన్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుకాబోతున్న ఈ స్టేడియంతో గణనీయమైన అభివృద్ధి జరగనుందని తెలిపారు. భవిష్యత్‌లో ఈ రహదారిని ఉనికిచర్ల నుంచి రాపాకపల్లి, దేవునూరుగుట్టల వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. దేవునూరు గుట్టలను ఎకో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News