Friday, March 13, 2026
Homeఆంధ్రప్రదేశ్AP | ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్..

AP | ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్..

  • ప్రమాణ స్వీకారం చేయించిన హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి..

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ఆమెతో హైకోర్టులో ప్రమాణం చేయించారు. ప్రస్తుత సీజే ధీరజ్‌ సింగ్‌ ఠాకురు ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే ప్రస్తుతం సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న లిసా గిల్‌ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్‌ లిసా గిల్‌ 2014 మార్చిలో పంజాబ్‌-హరియాణా హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News