సోసైటీ ఎన్నికల కోసమే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ సొసైటీ పాలకమండలి స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఉపాధ్యక్షురాలు సునీలా రెడ్డి మాట్లాడారు. గత పాలకమండలి తీవ్ర అవినీతికి పాల్పడటమే కాక 15 ఏళ్ల పాటు ఎన్నికల నిర్వహించకుండా కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. అతి కష్టం మీద ఎన్నికలు నిర్వహించగా తమ కార్యవర్గం విజయం సాధించినట్లు తెలిపారు.

ఆనాటి నుంచి వారి అవినీతిని సరి చేస్తూ సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. మరో వారంలో ఎన్నికలు ఉండడంతో తమ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చకు రావాలని సవాల్ విసిరారని అన్నారు. వారి సవాలను స్వీకరించి ప్రెస్ క్లబ్ కి వచ్చినా ఒకరు లేకపోవడం వారి ఆరోపణలో ఎంత నిజం ఉందో అర్థమవుతుందని అన్నారు. సొసైటీ సభ్యులు అనవసరపు ఆందోళన గురి కాకుండా 5న జరిగే ఎన్నికలలో సొసైటీని రక్షించే వారికి మద్దతు పలకాలని తెలిపారు.
