Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌Cricket | క్రికెట్ టోర్నమెంట్ ను ప్రాభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Cricket | క్రికెట్ టోర్నమెంట్ ను ప్రాభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

నేడు ఓల్డ్ అజిజ్ నగర్ లో పారిశ్రామిక వేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన FTCCI ప్రెసిడెంట్స్- 2025 క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథి గా హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్.. టోర్నమెంట్‌ను ప్రారంభించి నిర్వహిస్తున్న పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.. క్రికెట్ నిర్వాహకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి శాలువా తో సత్కారించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్వహకులు పరిశ్రమల అభివృద్ధికి మాత్రమే కాకుండా, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో కూడా ముందుండటం నిజంగా ఇది గొప్ప విషయం అని అన్నారు.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకూ శుభాకాంక్షలు తెలిపారు..ఆటలో గెలుపు–ఓటములు సహజమని అన్నారు.. అలాగే ఆటలో మంచి ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు, పరిశ్రమ రంగానికి,నా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో సైఫాబాద్ కమిషనరు సంజయ్ కుమార్.. క్రికెట్ నిర్వాహకులు రవికుమార్.. క్రీడాకారులు.. తదితరులు.. పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News