Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణKCR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి కేసీఆర్‌!

KCR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి కేసీఆర్‌!

సోమవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో అమలుకాలేని హామీలను ప్రజల ముందుంచి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముండటంతో.. తప్పనిసరిగా ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ ముఖ్య నేతలతో చర్చినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News