Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Party Joining | కాంగ్రెస్ కు జై కొట్టిన జయన్న తిరుమలాపురం యువత.

Party Joining | కాంగ్రెస్ కు జై కొట్టిన జయన్న తిరుమలాపురం యువత.

  • బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 45 మంది యువకులు.
  • సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి..

గోపాల్పేట మండలం జయన్న తిరుమలపురం గ్రామానికి చెందిన 45 మంది యువకులు మెకానిక్ రాములు ఆధ్వర్యంలో శుక్రవారం బి ఆర్ యస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ పాలనలో యువకులు తీవ్రంగా నష్టపోయామన్నారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ పరమైన ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పథకాలకు, పనితీరుకు ఆకర్షితులమై నేడు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News