- సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటాం
- కేంద్రహోంమంత్రి అమిత్ షా వెల్లడి
జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతైన లద్దాఫ్ విషయంలోనూ ప్రజలు లేవనెత్తిన డిమాండ్లపై కూడా ‘మంచి తీర్మానం’ చేస్తామని హామీ ఇచ్చారు. పాట్నాలో శనివారంనాడు జరిగిన మీడియా కాంక్లేవ్లో హోం మంత్రి మాట్లాడుతూ, ఉగ్రవాదం గుప్పిట్లో చిక్కిన జమ్మూకశ్మీర్ 370వ అధికరణ తర్వాత యూటర్న్ తీసుకుందని, గత తొమ్మది నెలల్లో లోకల్ టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా చోటుచేసుకోలేదని అన్నారు. ‘1990 నుంచి వేర్పాటువాద
చీడపీడల్లో చిక్కుకున్న జమ్ముకశ్మీర్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. గతంలో సరిహద్దులకు ఆవల నుంచి టెర్రరిస్టులను పంపాల్సిన అవసరం లేదని పాక్ భావించేది. మన పిల్లల చేతుల్లో ఆయుధాలు ఉంచేది. ఇప్పుడు పరిస్థితి మారింది. జమ్మూకశ్మీర్ ప్రజలంతా తాము దేశంతో ఉన్నామని, యావత్ దేశం తమ వెంట ఉందని బలంగా విశ్వసిస్తున్నారు’ అని అమిత్ చెప్పారు. మ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్ చెప్పారు. తాను సీఎంగా
ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా ఇంతవరకూ రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరగలేదంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాజకీయ అనివార్యతల వల్ల ఆయన అలా చెప్పి ఉండొచ్చని అన్నారు. కానీ రాష్ట్ర హోదా పునరుద్ధరణ సరైన సమయంలో జరుగుతుందని, సీఎంతో కూడా చర్చిస్తామని చెప్పారు. లద్దాఫ్లో లో ఇటీవల జరిగిన ఆందోళనను ప్రస్తావిస్తూ, లెహ్, కార్గిల్ కమిటీలతో కేంద్రం సంభాషణలు జరుపుతోందని చెప్పారు. ప్రజలు ఓర్పుతో ఉండాలని కోరారు. వారి న్యాయపరమైన డిమాండ్లపై మంచి తీర్మానం జరుగుతుందని వివరించారు.
