తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ (Mlc) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ‘జాగృతి జనం బాట’ (Jagruthi Janam Bata) కార్యక్రమాన్ని ఇవాళ నిజామాబాద్(Nizamabad)లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా తన మెట్టినిల్లు అని చెప్పారు. ఎంపీ(Mp)గా, ఎమ్మెల్సీ(Mlc)గా తనకు పట్టం కట్టి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఇది అని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే “జాగృతి జనం బాట”ను ప్రారంభించడం సముచితంగా భావించానని పేర్కొన్నారు.

అంతే ఉత్సాహంతో తనను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు(Thanks) తెలుపుతున్నాను అని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గురుకులాల్లో (Residential Schools) ఆత్మహత్యలు(Suicides), విద్యార్థులను ఎలుకలు కొరకటం, అత్యాచారాలు (Rapes) జరుగుతున్నాయని, దీనిపట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Government) సిగ్గుపడాలని దుయ్యబట్టిరు. విద్యార్థులకు కనీసం భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతున్నారని విమర్శించారు.

