Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంWarning | ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్..

Warning | ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్..

  • ఇరాన్ చీఫ్ గా ఎవరున్నా వారిని లేపేస్తాం..

ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ మంత్రి ఇజ్రాయెల్ క‌ట్జ్ వార్నింగ్ ఇచ్చారు. అలీ ఖ‌మేనీ స్థానంలో ఇరాన్ ఎవ‌ర్ని నియ‌మించినా.. ఆ వ్య‌క్తే త‌మ టార్గెట్ అవుతార‌ని ఇజ్రాయెల్ పేర్కొన్న‌ది. ఇరాన్‌కు చెందిన ఉగ్ర‌వాద పాల‌కులు త‌మ నేత‌గా ఎవ‌ర్ని నియ‌మించినా.. వారిని అంతం చేస్తామ‌న్నారు. ఇజ్రాయెల్‌కు కానీ, అమెరికాకు కానీ ఆ వ్య‌క్తి వ్య‌తిరేకంగా ఉన్నా, లేక ఇరానీ ప్ర‌జ‌ల‌ను హింసించినా, తాము ఊరుకోబోమ‌న్నారు.

అత‌ని పేరెంట‌న్న విష‌యం అవ‌స‌రం లేద‌ని, అత‌ను ఎక్క‌డ దాక్కున్నా ఏరివేస్తామ‌ని క‌ట్జ్ త‌న వార్నింగ్‌లో వెల్ల‌డించారు.అమెరికా భాగ‌స్వాముల‌తో క‌లిసి తాము పూర్తిగా దాడి చేస్తామ‌న్నారు. అయితే ఖ‌మేనీ స్థానంలో అత‌ని కుమారుడు మోజ్తాబాను ఇరాన్ సుప్రీం నేత‌గా ఎన్నుకున్న‌ట్లు తాజాగా ఓ మీడియా క‌థ‌నం ద్వారా తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News