Friday, May 1, 2026
Homeఅంతర్జాతీయంIran Leadership Crisis | ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం.. !

Iran Leadership Crisis | ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం.. !

  • ఖమేనీ మరణం తర్వాత ఈ సమస్య వచ్చిందా..?
  • అబ్బాస్ ఆరాగ్చిని తొలగించాలి..

ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆ దేశానికి నాయకత్వ సమస్య వేధిస్తుంది. ఇప్పుడు ఇరాన్‌ను నడిపిస్తున్న వారి మధ్య విబేధాలు కూడా మొదలయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ కోరుతున్నారు. ఇరాన్‌కు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అబ్బాస్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇరాన్ అధ్యక్షుడు, ఇతర నేతల్ని సంప్రదించడం లేదు. అలాగే, ఇరాన్ సైనిక సంస్థ అయిన ఐఆర్‌‌జీసీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ సంస్థతో కలిసి అబ్బాస్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాతో అణు చర్చల అంశంలో కూడా అబ్బాస్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఆయన ఏ సమాచారాన్ని అధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్, ఇతర నేతలతో పంచుకోవడం లేదు. అంతేకాదు, ఐఆర్‌‌జీసీ కమాండర్ అహ్మద్ వాహిదితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనను మాత్రమే సంప్రదిస్తూ అణు చర్చల అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News