Tuesday, February 10, 2026
Homeవరంగల్‌IRCS | ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం.

IRCS | ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం.

హనుమకొండ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం జిల్లా కార్యాలయ భవనంలోని (కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్), యందు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్, రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్ రక్తదాన ఉద్యమ పితామహులు (ఫాదర్ అఫ్ బ్లడ్ డోనార్స్) కార్ల్ ల్యాండ్‌ స్టీనర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముందుగా హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 2022–23, 2023–24, 2024–25 సంవత్సరా లకు సంబంధించిన వార్షిక నివేదికలు, ఆడిటెడ్ అకౌంట్లు, అలాగే రాబోయే సంవత్సరానికి ఆదాయ–వ్యయ అంచనాలను సర్వసభ్యులకు వివరించారు. ఈ వార్షిక నివేదికను సోదా రామకృష్ణ ప్రతిపాదించగా, మండల పరశురాములు బలపరిచారు. అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బండి సారంగపాణి ప్రతిపాదించగా, ఓరుగంటి లైలా బలపరిచారు. ఇందుకు సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీకి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ కు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ సేవాతత్పరతతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్థ అని, ప్రస్తుత పాలకవర్గం అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా తన వంతు సహాయ సహకారాలు రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తానని హామీ ఇచ్చారు. శాశ్వత సభ్యులు మరింత ఉత్సాహంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డా. మాగంటి శేషు మాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డా. కె. సుధాకర్ రెడ్డి, డా. సిహెచ్. సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, డీటీఓ ఎ. శ్రీనివాస్ కుమార్, టీజీవో ఏ. జగన్మోహన్ రావు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, టీఎన్జీవో రాజేందర్, సోమన్న, రెడ్ క్రాస్ ప్యాట్రన్లు పొన్నాల రామ్ మోహన్, రావుల అనిల్ కుమార్, గండ్ర నరోత్తమ్ రెడ్డి, జి. వెంకట్ నారాయణ, శాశ్వత సభ్యులు నడెం శాంతి కుమార్, బోడ డిన్న, కుసుమ శ్యామ్ సుందర్, నేహాల్, యాకుబ్ రెడ్డి, మండల పరుశరాములు, కార్పొరేటర్ : మానస రాంప్రసాద్, తాడిశెట్టి విద్యాసాగర్, జి. రవీందర్, గోపాల్, పి. శ్రీనివాస్, ట్రాన్సజెండర్ స్టేట్ ప్రెసిడెంట్ : లైలా, గుంటి స్వప్న, పూర్ణిమ రెడ్డి, రేష్మ, రెడ్ క్రాస్ సిబ్బంది, జీవితకాల సభ్యులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News