Wednesday, March 4, 2026
Homeమహబూబ్‌నగర్‌Constitution Day | అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు

Constitution Day | అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

దేశంలో అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల తో పాటు విధులు బాధ్యతలు పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు.

అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా ఎస్పీ సునీతతో కలిసి రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి, వివిధ శాఖల అధికారులు సిబ్బంది చేత భారత రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏ వో భాను ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News