కటక్(ఒడిశా)లోని బారాబటి మైదానంలో సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా (Team India) 101 రన్నుల తేడాతో ఘన విజయం (Grand Victory) సాధించింది. మన దేశం నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 రన్నులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఆధిపత్యం (Lead) సంపాదించింది.
తొలుత టాస్ ఓడిపోయిన ఇండియా.. బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మన టీమ్‌లో హార్దిక్ పాండ్య 59 రన్నులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్య, శివమ్ ధూబే చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బుమ్రా (Bumrah) అరుదైన రికార్డ్ (Rare Record) నెలకొల్పాడు. టీ20ల్లోనూ 100 వికెట్లు తీశాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
