ఓటు హక్కు ఎంతో విలువైంది.. ప్రజాస్వామ్య మన్నికకు ఓటు వజ్రాయుధం.. ఓటు అంటే కాగితం కాదు.. మన మాట, మన విలువ, మన భవిష్యత్తు మన అభివృద్ధి.. ఒక్క నిమిషం ఆలోచించి ఓటెయ్యి అభివృద్ధికి బాట వెయ్యి.. ప్రలోభాలకు లొంగి ఓటు తాకట్టు పెట్టకు నీతిమంతుడిని ఎన్నుకో.. మీ ఓటు అమ్మకానికి కాదు.. మీ నీతి, మీ గౌరవానికి నిదర్శనం.. ఒకరి నిర్లక్ష్యం వేలాది ఆశలను గాయపరుస్తుంది.. ఒకరి ఓటు వేలాది జీవితాలను వెలిగిస్తుంది.. కాబట్టి ఓటు ఒక హక్కు మాత్రమే కాదు.. బాధ్యతగా ఓటు హక్కును నిలబెట్టండి.. నేడు మీ ఓటు రేపు మీ భవిష్యత్తు అవుతుంది.
- కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
