కళ్ళు చెదిరే కథనం పార్టీ-1
- నకిలీ పత్రాలతో భూ దురాక్రమణ చేస్తున్న మెయిన్ లాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ..
- మూసాపేటలో మాస్టర్ ప్లాన్ లో లేని సర్వే నెంబర్లతో అక్రమ మార్గంలో పొందిన అనుమతులు..
- అక్రమంగా అనుమతులిచ్చిన జీహెచ్‌ఎంసి నాటి సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్..
- ఈ వ్యవహారంలో అతగాడికి ముట్టిన ముడుపులెంత..?
- ఓవర్ ల్యాప్ ఐ తొలగించిన సర్వే నెంబర్లతో కబ్జాకు తెర లేపిన సచ్చితానంద రావు
- అడ్డదారిలో పహాణిలో పేర్లు నమోదు చేసుకొని రికార్డులు ట్యాంపరింగ్..
- ఏ2ఏ హోం ల్యాండ్ పేరుతో అమాయక ప్రజలకు అంటకడుతున్న వైనం..
- రికార్డుల ట్యాంపరింగ్ లో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోవాలి..
- ఐడిపిల్ భూమిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజిలెన్స్ విచారణ జరిపించాలి..
- అక్రమ నిర్మాణాన్ని కూల్చి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి..
భారీగా ముడుపులు తీసుకున్నాడు.. అక్రమంగా అనుమతులు ఇచ్చి ఈ పాపంలో భాగస్వామి అయ్యాడు అప్పటి సిటీ ప్లానర్.. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ భూ భారతిలో ప్రభుత్వ భూమిగా చూపిస్తున్న భూమిలో లింక్ డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి.. అసలు మాస్టర్ ప్లాన్ లో లేని నెంబర్లతో అనుమతులు వచ్చేశాయ్.. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టుగా ఏదైనా సాధ్యం అయిపోతోంది గత ప్రభుత్వంలో..
ప్రజల ఆరోగ్యాలు కాపాడే మందులు తయారు చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భూమిని ఆక్రమించి దర్జాగా అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయక ప్రజలకు అంటగడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు.. అయినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భూమి అన్యాక్రాంతం అవుతున్నా అడ్డుకునే నాథులు లేకపోవడం దురదృష్టకరం..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కూకట్ పల్లి మండలం, మూసాపేట గ్రామ శివారులో ఐడిపీఎల్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఉంది.. ఇప్పుడు ఈ భూమిని కబ్జా చేయుటకు మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే నిర్మాణ సంస్థ కన్నేసింది.. సదరు భూమిని కబ్జా చేయుటకు రికార్డుల ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు ఈ అక్రమార్కులు.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన విషయం విధితమే.. వివరాల్లోౖళ్తే..
తొలుత రికార్డుల ట్యాంపరింగ్ తో అక్రమ మార్గంలో ఎంటర్ అయ్యారు కొందరు భూ కబ్జాకోర్లు.. వీరు భూమి కొనుగోలు చేశామని కలరింగ్ ఇస్తూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ చూపిస్తున్న రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.. సర్వేనెంబర్ 210/2 సర్వే నెంబర్ 210/3 ఈ రెండు సర్వే నెంబర్లలో 18 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు దురాక్రమణదారులు.. ఏదైనా ఒక గ్రామ శివారులో పట్టాదారుడైన ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు వారికి ఆ యొక్క సర్వే నెంబర్ సబ్ డివిజన్ గా మారి బై నెంబర్లతో రికార్డులో సదరు కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లు నమోదు చేయబడతాయి ఇది రెవెన్యూ చట్టం..

కానీ ఇక్కడ సర్వేనెంబర్ 210/2, 210/3 లను పరిశీలించినట్లయితే ఎం. సందయ్య తండ్రి పోచయ్య, టీ. దామోదర్ రావు తండ్రి సుబ్బారావు, కే. కోటేశ్వరరావు తండ్రి సుబ్బారావు, ఎస్. ధనలక్ష్మ భర్త వెంకటేశ్వరరావు… వీరంతా సర్వేనెంబర్ 210/2, సర్వే నెంబర్ : 210/3లలో ఎలాంటి సబ్ డివిజన్ లేకుండా తలా ఒకరు 4.20 గుంటలు ఒకేసారి కొన్నట్లుగా రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ చేసి, సింథటిక్ ఫ్యాక్టరీ పేరు మీద ఉన్న ఖాతా నెంబర్ 160ను అక్రమంగా పహానిలో తమ పేర్లను పట్టాదారులమంటూ నమోదు చేసుకొని కబ్జాకు తెర లేపారు అన్నది 1998-1999 పహాని చూస్తే స్పష్టమవుతుంది..
వీరు నిజంగానే భూమి కొనుగోలు చేసి ఉంటే వీరు పట్టాదారులుగా రికార్డులో నమోదయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఖాతా నెంబర్ (పట్టా నెంబర్) మంజూరు చేస్తారు రెవెన్యూ అధికారులు.. ఆ ఖాతాలో వీరికి సంబంధించిన భూములను పొందుపరచి పట్టా పాస్ బుక్ మంజూరు చేస్తారు.. కానీ ఇక్కడ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వీరు సింథటిక్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఖాతా నెంబర్ 160లో ఈ నలుగురికి అక్రమంగా బోగస్ పేపర్లను సృష్టించి రికార్డులో నమోదు చేసుకున్నారు..
అంతటితో ఆగకుండా వీరు గత టి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అల్లుడు అనిల్ కుమార్ ఈ కబ్జాలో భాగస్వామ్యం అయ్యాడనే విషయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. మెయిన్ లైన్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ నేరుగా కబ్జా చేస్తే వీరి బాగోతం బట్టబయలు వుంటుందని కొంతమంది నకిలీల పేరిట రికార్డులను సృష్టించారన్నది జగమెరిగిన సత్యం.. కాగా మరింత లోతుగా వీరి అక్రమ వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే…

ఏలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండానే తేదీ 26 ఆగస్టు 2019 రోజున బాలానగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సెల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.. సదరు డాక్యుమెంట్ సుమారు 16 నెలల వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా పెండిరగ్ లో పెట్టారు.. కబ్జాదారులు చూపిస్తున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో నాడు ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది.. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేశారు.. 16 నెలల తర్వాత తేదీ 23 డిసెంబర్ 2020 రోజున డాక్యుమెంట్ నెంబర్ 2028/2020 ఇస్తూ వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. మరి పహానిలో అక్రమంగా నమోదు చేసుకున్న సమయంలో వీరి ఖాతా నెంబర్ 160గా ఉంది..
కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోకి వచ్చేసరికి వీరి ఖాతా నెంబర్లు వీరికి వీరే రాసుకున్నారు అనడానికి నిదర్శనమే వీరి డాక్యుమెంట్.. వీరి డాక్యుమెంటులో పేజీ నెంబర్ 9లో గనుక చూసినట్లయితే ఎం. సందయ్య అనే వ్యక్తికి 4 ఎకరాల 20 గుంటలు, ఖాతా నెంబర్ 116, టీ. దామోదరరావు పేరు పైన 4 ఎకరాల 20 గుంటలు ఇతగాడి ఖాతా నెంబర్ 17 గా, కే. కోటేశ్వరరావు అనే వ్యక్తి పైన 4 ఎకరాల 20 గుంటలు ఇతగాడి ఖాతా నెంబర్ 8 గా, ఎస్. ధనలక్ష్మ అనే మహిళపై 4 ఎకరాల 20 గుంటలు ఖాతా నెంబర్ 18 గా చూపించారు.. మరి వీరి ఖాతాలు వేరైనప్పుడు సర్వే నెంబరు ఒకటే ఎలా అవుతుంది అన్నది ప్రశ్న..?
సర్వేనెంబర్ సబ్ డివిజన్ కాకుండా గతంలో అందరూ ఒకే ఖాతాలో 160లో ఉన్నట్టుగా ఈ యొక్క డాక్యుమెంట్ లో వేరువేరుగా ఉన్నట్లుగా చూపించారు.. ఆర్.ఓ.ఆర్. చట్ట నిబంధనల ప్రకారం వీరందరికీ వేరువేరు పాసుబుక్కులు, వేర్వేరు ఖాతా నెంబర్లు మంజూరు అయినప్పుడు సర్వే నెంబరు ఒకటే ఎలా ఉంటుందో ఈ కబ్జాదారులకు సహకరించిన రెవెన్యూ అధికారులే స్పష్టం చేయాలి.. ఇంత స్పష్టంగా కళ్లెదుటే వీరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని రికార్డులు ట్యాంపరింగ్ చేశారని తెలిసినా నిర్మాణ సంస్థకు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆడిరదే ఆట పాడిరదే పాట అన్నట్లు దర్జాగా కబ్జా చేశాడు..
(మిగతా కథనం రేపటి సంచికలో..)