Friday, March 13, 2026
HomeUncategorizedKapra Tahsildar | అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Kapra Tahsildar | అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలోని పలు కాలనీలలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారుల బృందం జేసీబీ సహాయంతో పలు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించారు. ప్రభుత్వ భూములపై అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన చోట్ల యంత్రాల సహాయంతో నిర్మాణాలను కూల్చివేశారు.

ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మకానికి పెట్టే దందాను సహించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -

అలాంటి వారి వివరాలను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు ఇలాంటి అక్రమ లావాదేవీలకు గురి కాకుండా ముందుగా భూములపై సరైన పత్రాలు, అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై నిరంతరంగా తనిఖీలు కొనసాగిస్తామని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News