కళ్ళు చెదిరే కథనం పార్ట్ – 2
- ముమ్మాటికీ మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడిరది..!
- మేడ్చల్ జిల్లా గత కలెక్టర్ ఈ భారీ భూకుంభకోణంపై ఎందుకు దృష్టిపెట్టలేదు?
- తొలుత నలుగురు వ్యక్తులకు కలిపి ఒకే ఖాతా నెంబర్..
- ఆ తరువాత నలుగురికి నాలుగు ఖాతా నెంబర్లు చూపించారు ఇదెలా సాధ్యం..?
- మరళా ఆ ఖాతా నెంబర్లను మార్చేశారు..!
- ఈ నలుగురికి కోసం రెవెన్యూలో కొత్త చట్టం ఏమైనా ప్రభుత్వం తీసుకువచ్చిందా?
- ఈ వ్యవహారంలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో సైతం కేసు నమోదైంది..
- మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థను ఆర్వోసీలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి..
- ఐడీపీఎల్ కు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలి..
- ముఖ్యమంత్రి గారూ ఈ వ్యవహారంపైఓ లుక్ వెయ్యండి..
- ఈ అక్రమంపై విచారణ సంస్థల చేత విచారణ జరిపించండి..
సామాన్యుల ఆరోగ్యాలు సురక్షితంగా ఉంచడానికి అవసరమైన మందులు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ అది.. ఆ సంస్థకు చెందిన భూమిని స్వాహా చేయడానికి భారీ ఎత్తున్న కుట్ర జరిగింది.. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ యాజమాన్యం కొందరు అవినీతి అధికారులను డబ్బుతో కొనేసి.. వారి ద్వారా వీరు సృస్టించిన నకిలీ డాక్యుమెంట్స్‌ను వాస్తవమైనవిగా చేసి అడ్డగోలుగా ఐడీపీఎల్ కు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.. మరి ఇంతటి భూ కుంభకోణం జరుగుతున్నా స్థానిక నాయకులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ, కలెక్టర్ స్థాయి అధికారి గానీ పట్టించుకోకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.. ఈ అవినీతి భాగోతంలో వీరందరికీ భాగస్వామ్యం ఉందా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కూకట్ పల్లి మండలం, మూసాపేట గ్రామ శివారులో ఐడిపిఎల్‌కు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్ర మంగా నిర్మిస్తున్న మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ చేసిన అవినీతి భాగోతాన్ని మొదటి పార్ట్‌లో కొంతమేర అందించాం.. ఇప్పుడు రెండవ పార్ట్‌లో పూర్తికథనాన్ని మీకుందుకు తీసుకుని వస్తున్నాం. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ లింక్ డాక్యుమెంట్ల నుండి అనుమతుల వరకు అన్ని అక్రమాలేనా? అప్పట్లో విధులు నిర్వర్తించిన అధికారులను అవినీతి నిరోధక శాఖ అండ్ విజిలెన్స్ విచారణ చేపడితే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయన్నది తథ్యం.. ఎందుకంటే వారు అక్రమాలకు పాల్పడ్డారు అన్న తాలూకు ఆధారమే.. వారు సృష్టించిన డాక్యుమెంట్లు తేటతెల్లం చేస్తున్నాయి..
అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇంత భారీ భూ కుంభకోణం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ యజమానులకు ఒక గ్రామ శివారులో ఒక వ్యక్తికి విభిన్న సర్వే నెంబర్లలలో భూమి కొనుగోలు చేసి ఉంటే, సదరు వ్యక్తికి ఒక ఖాతా నెంబర్ మంజూరు చేస్తారు.. వారికి సంబంధించిన భూమిని సదరు ఖాతాలో పొందుపరుస్తారు అన్నది చట్టం.. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థకు సందయ్య, దామోదర్ రావు, కోటేశ్వర్ రావు, ధనలక్ష్మ పేర్ల ద్వారా ఐడిపిఎల్ కు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయుటకు కుయుక్తులు పన్నారు అనడానికి వీరి ఖాతా నెంబర్లే అందుకు నిదర్శనం.. తొలుత నలుగురి కబ్జాదారులకు కలిపి ఒక్కటే ఖాతా నెంబర్ అదే 160.. ఆ తర్వాత 8,18,17, 116 ఖాతా నెంబర్లు ఉన్నట్లు చూపించారు..
ఇదే వ్యక్తులు ధరణి వచ్చేసరికి అధికారం అడ్డు పెట్టుకొని ఎవరికీ అనుమానం రాకుండా 210/2, 210/3లో గల భూమి ఖాతా నెంబర్ 314లో నమోదు చేశారు.. నాడు రెవెన్యూ రికార్డులో ఈ ఖాతాలో పోరంబోకు భూమిగా నమోద యింది.. దీని నుండి ఈ యొక్క భూమిని నోషనల్ ఖాతా నెంబర్ 20000101 లోకి మార్చారు.. ఈ రెండు సర్వే నెంబర్లలో ఉన్నటువంటి 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నట్లుగా ధరణిలో సర్వేనెంబర్ సబ్ డివిజన్ చేసుకొని, ధనలక్ష్మ పేరిట వీరు అక్రమంగా చూపించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉన్న ఖాతా నెంబర్ 18 నుండి ఖాతా నెంబర్ 60001 మార్చారు..

కోటేశ్వరరావు పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో 8గా చూపి ధరణిలో ఖాతా నెంబర్ 60002 గా ఎంట్రీ అయ్యారు.. అలాగే దామోదరావు పేరున 17 ఖాతా నెంబర్ చూపి ధరణిలో వచ్చే సరికి 60003గా రికార్డులోకి ఎక్కారు.. చివరగా ఏం. సందయ్య ఖాతా నెంబర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో 116 అని ధరణిలోకి వచ్చేసరికి 60004గా నమోదు చేసు కొని, 18 ఎకరాల భూమిని అక్రమంగా కాజేసినట్లు స్పష్టంగా వారు చూపించిన రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.. రెవెన్యూ రికార్డులలోని అంచలంచలుగా మారిన ఖాతా నెంబర్లలో ఏఏ అధికారికి ఎంతెంత ముడుపులు ముట్టాయన్నది ఇప్పుడు ఏసీబీ అధికారులకు పెను సవాల్‌గా మారే కేసు అనే చర్చలు వినిపిస్తున్నాయి..
ఈ రికార్డుల ట్యాంపరింగ్‌లో ఎంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడి, ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేశారు..? అన్నది విజి లెన్స్ విచారణలో బట్టబయలయ్యే అవకాశ ముంది.. వేల కోట్లు విలువచేసే ఈ ప్రభుత్వ భూమిని మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ సచ్చితా నందరావు అక్రమార్కులను అడ్డు పెట్టుకొని దర్జాగా కబ్జా చేసి భారీ నిర్మాణాలు నిర్మిస్తు న్నారు.. కాగా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. పైన తెలిపిన సర్వే నెంబర్లు కూకట్ పల్లి మండ లంలో, మూసాపేట్.. బాలనగర్ మండలంలో, బాలనగర్ విలేజ్ గా.. ఓవర్ లాప్ అయిన సర్వే నెంబర్లుగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.. హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిశీలిస్తే వారు ఆరోపించిన విషయం వాస్తవం అనటానికి బలం చేకూరు తుంది..
ఈ యొక్క మాస్టర్ ప్లాన్‌లో సర్వేనెంబర్ 210/2, 210/3 లు ఉండవు.. ఎందుకంటే ఇవి ఓవర్ ల్యాప్ అయిన సర్వే నెంబర్లు కాబట్టి వాటిని మాస్టర్ ప్లాన్ లో నుండి తొలగిం చారు.. వాటి స్థానంలో బాలనగర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 27, 28 మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు మాస్టర్ ప్లాన్ తేట తెల్లం చేస్తుంది.. ఇటీవలే ఐడిపిఎల్ కు సంబంధించిన 210/2, 210/3 లోగల భూములను పరిరక్షంచాలని కూకట్ పల్లి బి.ఆర్. ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యా దులు చేసిన విషయం విధితమే..

ఇంత బహిరంగంగా రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి, ఒకే వ్యక్తికి ఒకే గ్రామ శివారులో ఇన్ని ఖాతా నెంబర్లు ఉన్నట్లుగా సృష్టించినారని తెలిసినా, అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇటు రెవెన్యూ, అటు హెచ్‌ఎండిఏ అధికా రులు కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలు అనుమతులు ఇచ్చి, అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారనీ ఈ ప్రాంత ప్రజలు మండిపడు తున్నారు.. ప్రభుత్వ భూములను పరిరక్షంచాల్సిన అధికారులే మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ లాంటి యాజమాన్యం వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే వారికి పరోక్ష సహకారం అందించి, అక్రమాలను సక్రమం చేస్తున్నారు..
ఉన్నత స్థాయి అధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందా..? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.. సర్వే నెంబర్ 27, 28లో మాస్టర్ ప్లాన్ లో.. మాస్టర్ ప్లాన్ లో లేని సర్వే నెంబర్లను చూపుతూ నకిలీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసిన మొఖాపై 210/4 సర్వే నెంబర్ లో జిహెచ్‌ఎంసి లో పనిచేసిన నాటి సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.. మరి జిహెచ్‌ఎంసి లో పనిచేసిన సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్ కు 210/2, 210/3 సర్వే నెంబర్లు ఏక్కడ నుండి కనిపించాయో..? అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేస్తే ఇతగాడి అక్రమ వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం ఉంది..
మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్పందించి కూకట్ పల్లి మండలం, మూసాపేట గ్రామ శివారులో రెవెన్యూ రికార్డుల్లో చేసిన ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి.. కూర్చున్న స్థలంలో నుండి కంప్యూటర్‌లో రికార్డులను పరిశీలిస్తే వీరి కబ్జా వ్యాపారం, రికార్డుల ట్యాంపరింగ్, సృష్టించిన ఖాతా నెంబర్లు, చేస్తున్న కబ్జా ఇట్టే తెలిసిపోతుంది.. ఇప్పటికైనా తెలంగాణ జాతి సంపదను పరిరక్షంచడానికి.. అందులో భాగమైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుండి విడిపించడానికి.. నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తుల పైన.. అక్రమంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులపై భూ భారతి చట్టంలో నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. అక్రమంగా సృష్టించిన వీరి ఖాతా నెంబర్లు తేటతెల్లం చేస్తున్నాయి కాబట్టి, తక్షణమే అట్టి పాస్ బుక్కులను రద్దుచేసి, రెవెన్యూ రికార్డులలో తిరిగి యధావిధిగా ఐడిపిఎల్ కు సంబంధించిన భూమిగా రికార్డులో నమోదు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ ఏ టు ఏ హోమ్ ల్యాండ్ పేరుతో అమాయక ప్రజలకు అంటగట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది అనడానికి ఈ నకిలీ డాక్యుమెంట్లే నిదర్శనం.. కాబట్టి మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌కి సచ్చితానందరావు చేస్తున్న మోసాలను తెలిపి, సదరు కంపెనీ మరెక్కడా అక్రమాలు చేయకుండా.. కట్టడి చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలకు, ఇన్కమ్ టాక్స్ లో నమోదైన కేసుకు సంబంధించి, అక్రమ లావాదేవీలకు పాల్పడ్డ వ్యక్తుల వ్యవహారాలకు సంబం ధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘‘ఆదాబ్ హైదరాబాద్’’.. ‘‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’’.
