Monday, February 23, 2026
Homeరంగారెడ్డిInter-Caste Marriage | ఆదర్శ అంతర్‌కుల వివాహం సఫలం

Inter-Caste Marriage | ఆదర్శ అంతర్‌కుల వివాహం సఫలం

  • మగబిడ్డ జననంతో కుటుంబాల్లో ఆనందం

వేరు వేరు కులాలకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పరస్పరం ప్రేమించుకొని వివాహం చేసుకున్న ఆదర్శ ఘటన జవహర్ నగర్ పరిధిలో జరిగింది. మొదట ఇరువురి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించకపోయినా, గత సంవత్సరం డిసెంబర్ నెలలో మా ఆధ్వర్యంలో ఇరువైపుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పి ఒప్పించి వివాహం జరిపించారు.

ఈ ఆదర్శ వివాహానికి కొనసాగింపుగా మొన్న గురువారం దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తతో ఇరువైపుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అప్పట్లో తీసుకున్న నిర్ణయం సరైనదేనని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కుల భేదాలను దాటి ప్రేమను గౌరవించిన ఈ వివాహం సమసమాజ నిర్మాణానికి దారి చూపే ఉదాహరణగా నిలిచింది. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరింతగా వర్ధిల్లాలని, సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడాలని పలువురు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News