Homeరంగారెడ్డిAuto Union | ఐక్యమత్యం ఆటో యూనియన్ ప్రారంభం

Auto Union | ఐక్యమత్యం ఆటో యూనియన్ ప్రారంభం

  • కాలనీ వాసుల భద్రతే లక్ష్యం: కాలనీ అధ్యక్షుడు ఆర్ సి శ్రీకాంత

జవహర్ నగర్ సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ 02 పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐక్యమత్యం ఆటో యూనియన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ఆర్ సి శ్రీకాంత మాట్లాడుతూ కాలనీ వాసుల భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ఈ ఆటో యూనియన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రవాణా అవసరాల కోసం యూనియన్ గుర్తుగా స్టిక్కర్ ఉన్న ఆటోలను మాత్రమే వినియోగించాలని కాలనీ వాసులను ఆయన కోరారు. దీని వల్ల భద్రతతో పాటు జవాబుదారీతనం ఉంటుందని వివరించారు.

- Advertisement -
Aikyamathyam Auto Union Launch

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మంద లక్ష్మీనారాయణ కాలనీ క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర రవి మాట్లాడుతూ ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐక్యమత్యం ఆటో యూనియన్ అధ్యక్షుడు కృపవరం మాట్లాడుతూ కాలనీ వాసులకు నాణ్యమైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రంగుల హరిక్రిష్ణ, ఉపాధ్యక్షులు రంగుల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కొండ్రాతి నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, కార్యదర్శులు గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్, సహాయ కార్యదర్శులు కెమ్మసరం సుజాత, మన్నె జ్యోతి, టి సుజాత, సలహాదారులు సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్, కార్యవర్గ సభ్యులు సి హెచ్ బస్వరాజు, ఎర్ర వెంకటేష్, యం వంశి, వై మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ నాగచారి, ఆర్ చిత్తారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News