- ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్ రెడ్డి
- మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు
- మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్గా శృతి ఓజా
- ఆదేశాలు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం. రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ నియమితులయ్యారు. తెలంగాణలో నలుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
