Friday, October 3, 2025
ePaper
HomeUncategorizedసీనియర్‌ ఐఎఎస్‌ రోనాల్డ్‌ రోస్‌కు ఊరట

సీనియర్‌ ఐఎఎస్‌ రోనాల్డ్‌ రోస్‌కు ఊరట

  • తెలంగాణలో కొనసాగేలా క్యాట్‌ ఉత్తర్వులు

సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోనాల్డ్‌ రోస్‌(ronald rose)కు క్యాట్‌లో ఊరట లభించింది. రోనాల్డ్‌ రోస్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోనాల్డ్‌ రోస్‌.. ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ నుంచి రిలీవ్‌ అయ్యే ముందు రోనాల్డ్‌ రోస్‌.. విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం.. కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని ఐఏఎస్‌ అధికారులను గతేడాది అక్టోబర్‌లో డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించినా ఆయా ఐఏఎస్‌లకు ఊరట దక్కలేదు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి తెలంగాణ నుంచి రిలీవ్‌ అయ్యారు. వెంటనే ఏపీలో రిపోర్ట్‌ చేశారు. మొత్తానికి ఏడు నెలల తర్వాత క్యాట్‌లో రోనాల్డ్‌ రోస్‌కు ఊరట దక్కింది. తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News