సూపర్ హీరో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిరాయ్’(Mirai). సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం అద్భుత కలెక్షన్లతో రికార్డ్ (Record) క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ (Success Meet) నిర్వహించారు. ఈ వేడుకలో హీరో తేజ సజ్జా (Hero Teja Sajja) మాట్లాడుతూ ‘మిరాయ్’ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
‘పిక్చర్ రిలీజై దాదాపు 45 రోజులు అవుతోంది. ఓటీటీ(Ott)కి వచ్చే వరకు కూడా థియేటర్‌లో రన్ అవుతోంది. ఒక మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసి ఎంతో గొప్ప స్థాయికి తీసుకువెళ్తారు. నా కెరీర్‌లో ఇది ఎన్నో సార్లు జరిగింది. మీరు ప్రోత్సహించిన విధానం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ అందరికీ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఆడియన్స్ వల్లే ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ పాదాభివందనాలు’ అని చెప్పారు.
