Wednesday, February 18, 2026
HomeతెలంగాణRevanth Reddy | గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా హైదరాబాద్..

Revanth Reddy | గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా హైదరాబాద్..

  • హైదరాబాద్ క్యాపబిల్ సెంటర్ గా మారింది..
  • జీవ విజ్ఞాన రంగంలో దాదాపు రూ. 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి..
  • ఏషియా 2026 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే చార్మినార్.. బిర్యానీ.. ఫార్మా.. సాఫ్ట్వేర్ అని గుర్తు.. కానీ ఇవాళ గ్లోబల్ మాన్యుఫాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్య సంస్థలు.. ఇక్కడ ఉన్నాయి..

హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం.. జీనోమ్ వ్యాలీని విస్తరించాం.. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు “వన్-బయో”ను ప్రారంభించాం.. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేసాం… అనేక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని తెలిపారు.

- Advertisement -

ఇది సాధారణ అభివృద్ధి కాదు.. ఇది దృఢమైన దృష్టి ఫలితమని వెల్లడించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయోఏషియా 2026 అని సీఎం తెలిపారు. ఈ సభను చూస్తుంటే నేను గర్వంగా చెప్పగలను.. బయోఏషియా తన పేరును దాటి, బయో-వరల్డ్ గా మారుతోందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు..

ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారని తెలిపారు. సైన్స్, AI, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది అన్న నమ్మకం నాకు ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ తో పాటు ముఖ్యంగా జీవవిజ్ఞాన రంగంపై మా దృష్టిని మీతో పంచుకుంటాను. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యమన్నారు. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అలాంటి వాతవరణాన్ని కల్పిస్తుంది. దీనికి సమాధానం హైదరాబాదేనని అన్నారు. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. మేము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని తెలిపారు.

హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందన్నారు. ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ GCCలను స్థాపించండి, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించండని కోరారు. మాలిక్యూల్స్, ఔషధాలను డిజైన్ చేయండి క్లినికల్ అనలిటిక్ను నడపండి, AI ప్లాట్ఫారమ్లను అభివృద్ధి చేయండి, డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండని వెల్లడించారు.

మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువతగా మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారని సీఎం రేవంత్ తెలిపారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుండి ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందని తెలిపారు. ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. తెలంగాణ అంటే వ్యాపారం.. తెలంగాణ ఎదుగుతోంది.. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములుకండి.. అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News