Tuesday, February 10, 2026
Homeబిజినెస్HR88B8888 | దేశంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్

HR88B8888 | దేశంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్

HR88B8888.. దేశంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్‌(Number Plate)గా నిలిచి రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా కోటీ 17 లక్షల రూపాయలు పలికింది. ఈ నంబర్ కోసం 45 మంది పోటీపడ్డారు. హర్యానా(Haryana)లో నిన్న బుధవారం నిర్వహించిన ఇ-వేలంలో ప్రారంభ ధర రూ.50 వేలు పెట్టారు. అక్కడి నుంచి మొదలై ఒక దశలో రూ.88 లక్షలకు చేరింది. సాయంత్రం 5 గంటల కల్లా రూ.1.17 కోట్ల మార్క్‌ను చేరుకుంది.

ప్రీమియం వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ల(premium vehicle registration numbers) కోసం ఆ రాష్ట్రంలో ప్రతివారం ఇలాంటి ఇ-ఆక్షన్లను నిర్వహిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు అప్లికేషన్లను తీసుకుంటారు. బుధవారం వరకు యాక్టివ్ బిడ్డింగ్ (Active Bidding) జరుగుతుంది. గతవారం HR22W2222 అనే నంబర్‌ను రూ.37.91 లక్షలకు దక్కించుకున్నారు. HR88B8888.. ఈ నంబర్‌కి మధ్యలో B అనే ఇంగ్లిష్ అక్షరం ఉన్నప్పటికీ అది కూడా 8 లాగే కనిపిస్తుండటం భారీ డిమాండ్ పలికింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News