అక్టోబర్ మాసం అంటే విద్యార్థులకు సెలవుల మాసం అనే చెప్పుకోవొచ్చు..ఈ సారి దసరా సెలవులు సెప్టెంబర్ నుంచే మొదలవడంతో అక్టోబర్‌లో జరిగన దసరా పండగతో ముగిశాయి..మరో వారం రోజులు బడికి పోతే మళ్లీ సెలవులు వచ్చేస్తున్నాయి..అది ఎలాంటే రాబోయే దీపావళి పండుగ సందర్భంగా పాఠశాలలకు 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 18 నుండి 23 వరకు ధన్ తేరాస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి పండుగల సందర్భంగా విద్యార్థులు కుటుంబంతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠశాల విద్యార్థుల్లో సంతోషం పదింతలు అనుకోవొచ్చు…దీంతో అక్టోబర్ నెల పండుగలు, సెలవులతో విద్యార్థులకు మరింత ఆనందాన్ని తీసుకురానుంది. అయితే, ఈ సెలవుల వ్యవధి రాష్ట్రం, పాఠశాల యాజమాన్యాన్ని బట్టి మారవచ్చు.