Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణBC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు విచారణ వాయిదా..

BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు విచారణ వాయిదా..

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది.  అక్టోబర్ 9న మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను కోర్టుకు అందజేశారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారని వివరించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారం మధ్యాహ్నానానికి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News